అంబేద్కర్ విగ్రహం పెట్టే వరకు పోరాటం చేస్తాం: వివేక్ వెంకటస్వామి

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టే వరకు పోరాటం ఆపేదిలేదన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. దళితులను నమ్మించి మోసం చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఫూల్ బాగ్ లోని అంబేద్కర్ కమిటీ హాల్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామన్నారు తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి మల్లేశ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు.

Latest Updates