రాష్ట్ర చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్తాం: వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య వైభవంపై ప్రచారం చేసేందుకు.. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా తెలంగాణ వైభవం కార్యక్రం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు కరీంనగర్ లో ఈ ప్రోగ్రాం జరగనుంది. ఇప్పటికే వీ6 చానెల్ ద్వారా రాష్ట్ర చరిత్ర తెలిసేలా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామన్నారు బీజేపీ నేత వివేక్. వెలుగు పత్రిక ద్వారా కూడా ప్రజల్లోకి రాష్ట్ర చరిత్ర తీసుకెళ్తామని చెప్పారు.

Latest Updates