‘అడ్వెంచర్స్ ఆఫ్ ది జీఎస్టీ మ్యాన్’బుక్ ఓపెనింగ్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్‍, వెలుగు: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారికి ‘అడ్వెంచర్స్ ఆఫ్ ది జీఎస్టీ మ్యాన్’బుక్ ఎంతో దోహదపడుతుందని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నా రు. శనివారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ లా కాలేజ్ లో ‘అడ్వెంచర్స్ ఆఫ్ ది జీఎస్టీ మ్యాన్’అనే ఇండియాస్ ఫస్ట్ కామిక్ బుక్‍ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రీనివాస్ కోట్ని రాసిన ఈ పుస్తకం సామాన్యులకు కూడా జీఎస్టీ అంటే ఎంటో సులువుగా అర్థమయ్యేలా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి  వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి జి. వినోద్, ఎఫ్ టీసీసీఐ ప్రెసిడెంట్ అరుణ్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

Latest Updates