RTCని నాశనం చేసేందుకు KCR కంకణం : వివేక్ వెంకటస్వామి

RTCని నాశనం చేసేందుకు CM KCR కంకణం కట్టుకున్నారని విమర్శించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. సొంత బంధువులకు ఆర్టీసీ ఆస్తులను కట్టబెడుతున్నారని ఆరోపించారు. కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన…. కార్మికుల బంద్ కు మద్దతుగా నిరసనల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి

ఆర్టీసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కు మద్దతుగా ఇప్పటికే పలు ప్రైవేట్ రవాణా సంస్థలు మద్దతునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాహణాలు రోడ్డెక్కలేవు. హైదరాబాద్ లో కూడా ప్రైవేట్ క్యాబ్ లు, ఆటోలు సమ్మెకు మద్దతునిచ్చాయి. దీంతో హైదరాబాద్ లో రవాణా స్థంభించింది. విదేశాల నుంచి వచ్చిన ప్యాసింజర్ లు ఎయిర్ పోర్ట్ లోనే పడిగాపులు పడుతున్నారు. ఇటు క్యాబ్ లు, అటు బస్సులు లేక ఎయిర్ పోర్ట్ లోనే ఉండి పోయారు.

Latest Updates