కుటుంబ రాజకీయాలు చేయడం KCRకే సాధ్యం: వివేక్

vivek-venkataswamy-comments-on-cm-kcr

ఉద్యమకారులను పక్కన పెట్టి కుటుంబ రాజకీయాలు చేయడం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని అన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సూర్యపేటలో మాట్లాడిన ఆయన… ఉద్యమంలో జైలుకెళ్లిన వారుకూడా కేసీఆర్ చేసే పనులపై ఫైర్ అవుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడూ మద్దతివ్వని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు బంగారు తెలంగాణలో తానూ భాగస్వామిని అంటే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు.

ఎన్నికలప్పుడు నల్లగొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ఎలక్షన్స్ అయ్యాక అటువైపు తిరిగి చూడలేదని అన్నారు వివేక్. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే MPఎలక్షన్స్ లో బీజేపీకి నాలుగు సీట్లిచ్చారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉండాలన్నారు వివేక్. ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ కే చెందుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందని కేంద్ర సహకారంతో ప్రజలకోసం పనిచేస్తామని వివేక్ చెప్పారు.

Latest Updates