కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నరు: వివేక్

కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని మండిపడ్డారు.. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి. ఆర్టీసీ కార్మికులకు 25వేల కంటే తక్కువ జీతాలు ఉన్నాయన్నారు. గాంధీ సంకల్పయాత్రలో భాగంగా.. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఏర్పాటు చేసిన సభలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. కల్వకుంట్ల తెలంగాణ కావాలనేది కేసీఆర్ లక్ష్యమన్నారు వివేక్.  కాంట్రాక్టులన్నీ ఆంధ్రావారికే ఇస్తున్నారని ఆరోపించారు. 30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచారన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 60వేల కోట్ల అప్పు ఉంటే… ఇప్పుడు 3లక్షల కోట్ల అప్పు ఉందన్నారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates