కేసీఆర్, టీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయం బీజేపీనే

కేసీఆర్, టీఆర్ఎస్ లకు  ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకట స్వామి. తరుణ్ చుగ్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రాణహిత చేవెళ్లను కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు. ఏపీ 60 టీఎంసీల నీళ్లు దోచుకుంటున్నా నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర నిధులన్నీ మేఘా కంపెనీకి దోచిపెడుతున్నాడన్నారు. దేశంలో అవినీతిలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్..అని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. దుబ్బాక, జిహెచ్ఎంసి తరహాలోనే నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ చెంప చెల్లు మనిపించాలన్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా కూల్చేసిన ఘనత కేసీఆర్ దేనన్నారు వివేక్.

Latest Updates