జగన్ జాగ్రత్త.. కేసీఆర్ వాడుకుని వదిలేస్తరు

తిరుమలలో బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి

తిరుమల, వెలుగు:  తెలంగాణ సీఎం కేసీఆర్ కు మిత్రులు ఎవరూ ఉండరని, సందర్భాన్ని బట్టి అందర్నీ వాడుకుని వదిలేస్తారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. “సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మంచి మిత్రులని చాలా మంది అనుకుంటారు. కానీ జగన్ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ వాడుకుని వదిలేస్తారు” అని అన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లింకు ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. తన తండ్రి కాకా పుట్డినరోజే మనవడు వీర్ వెంకటస్వామి పుట్టాడని, తిరుమల వెంకన్నకు పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించుకున్నామని చెప్పారు.

For More News..

రేవంత్​ ఓ కబ్జా కోరు

చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్

ఆంధ్రాలో తెలంగాణ లిక్కర్.. కోట్లు దండుకుంటున్న బోర్డర్ వైన్ షాపులు

సోషల్‌‌ మీడియాకు మోడీ గుడ్‌‌బై!

Latest Updates