కప్పు సాసర్లు అందిస్తేనే కేసీఆర్ వద్ద మెప్పు, పదవులు

ములుగు : పోడు భూముల పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాతుందన్నారు ఆదివాసీలు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో పోడు రైతుల హక్కుల రక్షణ సభను నిర్వహించారు. ఈ సభకు జేఏసీ చైర్మన్ కోదండరామ్. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు సీతక్క, ఆదివాసి సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎంపీ వివేక్… దళితులకు, ఆదివాసీలకు సీఎం కేసీఆర్ ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉండి జకీయాలు, ఓట్లు, సీట్లు మాత్రమే ఆలోచన చేస్తారన్నారు. పొడు భూములు సంగతి ఆయనకు పట్టదని.. రైతు బంధు పధకం పెట్టేముందు ఈ స్కీం వల్ల కౌలు రౌతులకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ చాలా సందర్భాల్లో తాను చెప్పినట్లు తెలిపారు.

టెండెన్సీ ఆక్ట్ పెరు చెప్పి తప్పించుకున్నారని..మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఇక్కడ కుర్చీ ఏసుకొని కూర్చుంటా అన్నారు. ప్రాజెక్టుల్లో సీఎంకు కమిషన్ తప్ప ఇంకో ధ్యాస లేదన్నారు. ఉద్యమం సారథి కోదండరాం గారికి పేరు వస్తుంది అని అక్కసుతోనే పక్కకు పెట్టారని చెప్పారు వివేక్. హరీష్ రావును అలానే పెట్టారని.. కప్పు సాసర్లు అందించిన వారికే కేసీఆర్ వద్ద మెప్పు, పదవులు దక్కుతాయని తెలిపారు.

దళితుడు ప్రతిపక్ష నేత అయితే తట్టుకోలేని కేసీఆర్ సీఎల్పీని విలీనం చేయాలని చూస్తున్నారని.. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నియంత పాలన వల్లనే 7 సీట్లు TRS కోల్పోయిందన్నారు. ఇంకొంచెం కష్టపడితే ఇంకో 4 సీట్లు వచ్చేవని..కచ్చితంగా ప్రదాని మోడీని, రాష్ట్రపతిని కలిసి హక్కుల గురించి వివరిస్తానని తెలిపారు వివేక్ వెంకటస్వామి.

Latest Updates