అశ్వత్థామరెడ్డి ధీక్షకు సంఘీభావం ప్రకటించిన వివేక్ వెంకటస్వామి

మీర్ పేటలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని పరామర్శించారు బీజేపీ నేతలు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ… అశ్వత్థామరెడ్డి తన ఇంట్లోనే నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. అశ్వత్థామరెడ్డి దీక్షకు మద్దతు పలికేందుకు వెళ్లిన వివేక్, జితేందర్ లను పోలీసులు దారి మధ్యలో అడ్డుకున్నారు. అడ్డుకున్న చోటే వివేక్, జితేందర్ నిరసన తెలిపారు. అశ్వత్థామ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని … ఉన్నతాధికారులతో మాట్లాడారు. అధికారుల సూచనతో.. పోలీసులు వివేక్, జితేందర్ లను దగ్గరుండి అశ్వత్థామరెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. అశ్వత్థామరెడ్డిని కలిసిన నాయకులు… ఆయన దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

Latest Updates