అమర జవాన్లకు వివేక్ వెంకటస్వామి నివాళులు

పెద్ద పల్లి జిల్లా : గోదావరిఖనిలో వెలుగు టి20 క్రికెట్ టోర్నమెంట్ కు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. పెద్దపెల్లి, రామగుండం జట్ల మధ్య మ్యాచ్ ను వివేక్ ప్రారంభించారు. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన అమరవీరుల జవాన్లకు వివేక్, ప్లేయర్లు నివాళులు అర్పించారు.

టాలెంట్ ఉన్న క్రికెట్ ప్లేయర్లను ప్రోత్సహించడానికి వెలుగు పత్రిక టీ20 క్రికెట్ మ్యాచ్ లను నిర్వహిస్తోందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. 90 నియోజకవర్గాల నుంచి ప్లేయర్లను సెలెక్ట్ చేసి టోర్నీ నిర్వహిస్తున్నామని అన్నారు. వచ్చే ఏడాది మరింత ప్రోత్సాహంతో వెలుగు టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారాయన.

Latest Updates