వివో వై17 వచ్చేసింది

చైనా స్మార్ ట్‌ ఫోన్‌ మేకర్‌ వివో తన లేటెస్ట్‌ స్మార్ ట్‌ ఫోన్‌వై17ను శనివారం ఇండియా మార్కె ట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.17,990. ఇది మినరల్‌ బ్లూ,మిస్టిక్‌ పర్పుల్‌ కలర్స్‌‌లో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌ కార్ట్‌ , అమెజాన్‌ , పేటీఎం, వివో ఈ–స్టోర్‌ నుంచి దీనిని కొనుక్కోవచ్చు. మొబైల్‌ ఎక్స్‌‌చేంజ్‌ ద్వారా కొంటే అదనంగా రూ.వెయ్యి డిస్కౌంట్‌‌ ఇస్తారు. వివోవై17లో 6.35 ఇంచుల స్క్రీన్‌ , మీడియాటెక్‌ హీలియోపీ35 ప్రాసెసర్‌ , 20 ఎంపీ ఫ్రంట్‌‌ కెమెరా, వెనుక మూడుకెమెరాలు, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌ ,128 జీబీ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Latest Updates