
ఆఫ్‌లైన్ మార్కెట్లోకి మరింత విస్తరించడానికి ‘ఎస్’ సిరీస్ ఫోన్లను ఈ విభాగంలోకి తీసుకురావాలని చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో నిర్ణయించింది. ఎస్ సిరీస్ ఫోన్ల ధరలు రూ.15 వేలు–రూ.25 వేల మధ్య ఉంటాయని తెలిపింది. వీటికి ప్రచారం కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ను నియమించుకుంది. ఎస్ సిరీస్ ఫోన్లు ఆకర్షణీయంగా ఉంటాయని, సెల్ఫీలు అద్భుతంగా వస్తాయని వివో ఇండియా డైరెక్టర్ (బ్రాండ్ స్ట్రాటజీ) నిపుణ్ మార్యా అన్నారు. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో వివో 13 శాతం మార్కెట్వాటా సాధించి మూడోస్థానాన్ని సంపాదించుకుంది. తొలిస్థానంలో షావోమీ, రెండోస్థానంలో శామ్సంగ్ నిలిచింది. ఈ క్వార్టర్లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి.