వివోలో కొత్త ఫీచర్‌‌‌‌

Vivo to introduce earthquake warning feature in FunTouch OS 10

చైనాకు చెందిన స్మార్ట్‌‌ఫోన్‌‌ తయారీ సంస్థ ‘వివో’ త్వరలో కొత్త ఫీచర్‌‌‌‌ను అందుబాటులోకి తేనుంది. స్మార్ట్‌‌ఫోన్లలో ఉండే వెదర్‌‌‌‌ ఫీచర్‌‌‌‌కు అదనంగా ‘ఎర్త్‌‌క్వేక్‌‌ ఫీచర్‌‌‌‌’ను వివో ఫోన్లలో ప్రవేశపెట్టబోతోంది. ‘వివో’ ఫోన్లకు చెందిన ‘ఫన్‌‌టచ్‌‌ ఓఎస్‌‌ 10’ వెర్షన్‌‌లో ఈ ఫీచర్‌‌‌‌ ఉంటుందని కంపెనీ చెప్పింది. వివో ఫోన్లలో ఈ ఫీచర్‌‌‌‌ ఎనేబుల్ చేసుకుంటే చాలు. అక్కడికి దగ్గర్లో భూకంపం వచ్చే అవకాశాలు ఉంటే కొన్ని సెకండ్ల ముందే హెచ్చరిస్తుందని వివో పేర్కొంది. ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌‌‌‌ షావోమీకి చెందిన కొన్ని స్మార్ట్‌‌ఫోన్లలో ఉంది. ‘ఎమ్‌‌ఐయూఐ 11’తోపాటు కొన్ని ‘ఎమ్‌‌ఐ టీవీ’లలో కూడా ఈ ఫీచర్‌‌‌‌ ఉందని షావోమీ తెలిపింది. ఈ డివైజ్‌‌ వాడుతున్న యూజర్లకు భూకంపం గురించి కొన్ని సెకండ్ల ముందే వార్నింగ్‌‌ అలర్ట్‌‌ వస్తుంది. ‘వివో’ ఫోన్లకు సంబంధించి ఈ ఏడాది నుంచి ‘ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ ఆపేస్తామని ప్రకటించింది. ‘2020లో కొత్త ప్రణాళికలకు అనుగుణంగా సెల్‌‌ఫోన్లకు సంబంధించి ఆన్‌‌లైన్‌‌ ఎక్స్‌‌క్లూజివ్‌‌ సేల్స్‌‌’ను ఆపేస్తాం.

ఆన్‌‌లైన్‌‌తోపాటు, రిటైల్‌‌ ఔట్‌‌లెట్‌‌లోనూ ఫోన్లను అందుబాటులో ఉంచుతాం’ అని వివో ప్రతినిధులు అన్నారు. వివోతోపాటు సామ్‌‌సంగ్‌‌, రియల్‌‌ మి, ఒప్పో లాంటి సంస్థలు కూడా ఈ ఏడాదిలో ఇదే పద్ధతిని ఫాలో అవనున్నాయి. త్వరలో విడుదలయ్యే అన్ని మోడల్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌.. రెండు రకాలుగా అందుబాటులో ఉంచుతారు.

Vivo to introduce earthquake warning feature in FunTouch OS 10

Latest Updates