బొమ్మ తుపాకీతో హల్ చల్ చేసిన గీతం స్టూడెంట్

వైజాగ్ : ఇంజినీరింగ్‌ విద్యార్థి తుపాకీతో హల్‌ చల్‌ చేసిన సంఘటన వైజాగ్ జరిగింది. శుక్రవారం ఉదయం ఎండాడ-రుషికొండ రోడ్డుపై ఆగి ఉన్న కారును బైకుపై వస్తున్న యువకుడు విజయకృష్ణారెడ్డి ఢీకొట్టాడు. తన బైకుకు నష్టం జరిగిందని కారు దగ్గర ఉన్న మెకానిక్‌ నల్లరాజుతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరు పరస్పరం వాదులాడుకుని ఘర్షణ పడ్డారు. అంతటితో ఆగని విజయకృష్ణారడ్డి మధ్యాహ్నం సమయంలో పది మంది విద్యార్థులతో అక్కడికి వెళ్లి గొడవ చేశాడు. తుపాకీ చూపించి చంపేస్తానని నల్లరాజును బెదిరించాడు. కారుకు గురిచూసి కాల్చాడు. తుపాకీలోంచి చిన్నపాటి గుండు బయటకు వచ్చింది.

సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన ఆరిలోవ పోలీసులు విజయకృష్ణారెడ్డి, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అది ఒరిజినల్‌ తుపాకీ కాదని, అందులో బుల్లెట్లు ఉండవని తెలిపారు పోలీసులు. ఈ తుపాకీలో బేరింగ్‌ బాల్స్‌ ఉపయోగిస్తారని చిన్న సెటిల్ మెంట్ల కోసం ఇవి ఉపయోగిస్తారని తెలిపారు పోలీసులు.

Latest Updates