భర్త అంత్యక్రియలు..వాట్సాప్ వీడియోలో వీడ్కోలు పలికిన భార్య

విశాఖ లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మరణించిన యువకుడికి అతని కుటుంబసభ్యులు వాట్సాప్ లో వీడ్కోలు పలకడం పలువురిని కంటతడి పెట్టిస్తుంది.

విశాఖ జిల్లా ఎస్ రాయవరం మండలం వమ్మవరం  గ్రామానికి చెందిన  వెలుగుల సూర్య రావు (33) విదేశంలో ఓ కంపెనీలో పనిచేస్తూ మృతి చెందాడు. అయితే బాధితుడు డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందుకు కంపెనీ అధికారులు ప్రయత్నించారు. కరోనా వైరస్ వల్ల జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవ్వడంతో డెడ్ బాడీని అక్కడి నుంచి తెచ్చేందుకు సాధ్యపడలేదు. దీంతో అక్కడే సూర్యరావు అంత్యక్రియలను నిర్వహించారు. సూర్యరావు అంత్యక్రియల్ని వాట్సాప్ వీడియోలో భార్య, కుటుంబసభ్యులు వీడ్కోలు పలికారు.

Latest Updates