సహజీవనంలో విభేదాలు: మహిళా గ్రామ వాలంటీర్ దారుణ హత్య

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో దారుణం జరిగింది. సహజీవనంలో విభేదాలు వచ్చి, విడిపోయిన మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. నర్సీపట్నానికి చెందిన గ్రామ వాలంటీర్ రెడ్డి శ్రీదేవి, మురళీ అనే వ్యక్తితో రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
గడిచిన నెల రోజులుగా విడిపోయి ఎవరికి వారు ఉంటున్నారు. పది రోజుల నుంచి ఆమె మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని మురళీ కోపం పెంచుకున్నాడు.
దీంతో మంగళవారం ఒంటరిగా వెళ్తున్న శ్రీదేవిని వెంబడించాడు మురళీ. పాత బస్టాండ్ సమీపంలో రాడ్ తో తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నర్సీపట్నం టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

నిందితుడు మురళీ

Latest Updates