డిసెంబర్ నుంచి చార్జీలు పెంచనున్న ఐడియా, ఎయిర్‌టెల్‌

వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీలు కొద్ది రోజుల క్రితం భారీ స్థాయిలో నష్టాలను ప్రకటించింది. అయితే వ్యాపారం లాభదాయకంగా మార్చుకునేందుకు ధరలను పెంచుతున్నట్లుగా ఈ కంపెనీలు తెలిపాయి. ఈ చార్జీలను డిసెంబరు ఒకటో తేది నుంచి పెంచనున్నట్లు ముందుగా వొడాఫోన్‌ ఐడియా ప్రకటించింది. తమ కస్టమర్లు ప్రపంచస్థాయి డిజిటల్‌ అనుభూతిని ఆస్వాదించేందుకు ప్రయత్నాలు చేస్తామని, అందుకు అనుగుణంగా తమ టారీఫ్‌ను పెంచుతున్నామని వొడా ఐడియా స్పష్టం చేసింది. వొడాఫోన్‌ ఐడియా ప్రకటించిన కొంత సమయానికే భారతీ ఎయిర్‌టెల్‌ కూడా తమ చార్జీలను డిసెంబర్‌ నుంచి పెంచనున్నట్లు తెలిపింది. ధరలు పెంచుతామని మాత్రమే ఈ కంపెనీలు ప్రకటించాయి కానీ వాటి ధరలను ఎంత రేంజ్ వరకు పెంచుతారనేది మాత్రం ఈ రెండు కంపెనీలు ఇంకా ప్రకటించలేదు.

Latest Updates