వొడాఫోన్ ఐడియా ఆస్తుల అమ్మకం

vodafone idea in talks to sell indus tower stakes and Fiber Assets
  • రూ. 20 వేల కోట్లకు టవర్లు, ఆప్టికల్ ఫైబర్‌ ఆస్తుల విక్రయం
  • అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ అమ్మకం

vodafone idea in talks to sell indus tower stakes and Fiber Assetsన్యూఢిల్లీ: మొబైల్ టవర్ సంస్థ ఇండస్ టవర్‌‌‌‌లో ఉన్న వాటాలను, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వొడాఫోన్​ ఐడియా అమ్మేయాలనుకుంటోంది. ఈ అమ్మకం ద్వారా రూ.20వేల కోట్లను రాబట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా తన రుణాలను తగ్గించుకునేందుకు ఈ నిధులను వాడుకోనుంది. 2018 ముగిసే నాటికి వొడాఫోన్ ఐడియాకు రూ.1,23,660 కోట్ల రుణం ఉంది. ‘మొబైల్ టవర్లను, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను అమ్మడం ద్వారా సుమారు రూ.20వేల కోట్లను వొడాఫోన్ ఐడియా పొందుతుంది. వీటి అమ్మకం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని తెలుస్తున్నాయి. ఇండస్ టవర్స్‌ లో ఆదిత్య బిర్లా గ్రూప్‌ కున్న 11.15 శాతం వాటాలను అమ్మాలనే ప్లాన్‌ లో ఉన్నట్టు కంపెనీ అంతకముందే ప్రకటించింది. అదేవిధంగా 1.56 లక్షల ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను అమ్మనున్నట్టు చెప్పింది.

Latest Updates