వోడా ఫోన్ నయా ప్లాన్: ఏడాది పాటు కాల్స్ ఫ్రీ

vodafone-offers-1-5gb-unlimited-calling-free-for-a-year

వోడాఫోన్ తన యూజర్లకోసం ఓ కొత్త ప్లాన్ ను తీసుకవచ్చింది. రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ 100 SMS లను ఏడాది పాటు ఉచితంగా అందివ్వనుంది. అయితే ఇందుకు చేయవలసిందల్లా… వోడాఫోన్ వెబ్ సైట్ నుంచి సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిఉంది.  ఈ ఆఫర్ వోడాఫోన్ వాడేవారికి మాత్రమే.. కొత్త యూజర్లకు వర్తించదు.

సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇష్యూ అయిన తర్వాత… ఒకేసారి లేదా పలు సార్లు 4 వేల రూపాయలను కార్డు ద్వారా కర్చు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాతే.. వోడాఫోన్ ఆఫర్ సదరు యూజర్ కు వర్తిస్తుంది.  సంవత్సరం పాటు 1.5 GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, డేలీ 100 SMS లు ఏడాది పాటు అందుబాటులోకి వస్తాయి.

ఆఫర్ కొన్ని సర్కిళ్లలోనే అందుబాటులో ఉంది…
ఈ కొత్త ఆఫర్ ఢిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, కోయంబత్తూరు, వడోదర, చండీగఢ్, సికింద్రాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే లాంటి పట్నాలలో మాత్రమే అందుబాటులో ఉంది.  వోడాఫోన్ వెబ్ సైట్ ప్రకారం ఈ ఆఫర్ జులై 31 వరకు ఉంది.

Latest Updates