గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ మ‌హిళా కుటుంబానికి రూ.5 లక్షలు

అమరావతి :  విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్‌ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించిన విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌ తెలియ‌గానే సీఎం‌ జగన్ శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు అధికారులు. వాలంటీర్ మృతిపై సీఎంఓ అధికారులతో సీఎం జ‌గ‌న్ ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారన్నారు.

విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటిస్తూ, ఈ సహాయం వెంటనే కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన‌ట్లు తెలిపారు అధికారులు.

Latest Updates