సగం అటు సగం ఇటు.. రెండు రాష్ట్రాల్లో గ్రామస్థుల ఓట్లు

ఆసిఫాబాద్,వెలుగు : ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో జనం సగం అటు, సగం ఇటు ఓట్లు వేశారు.తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో మొత్తం 12 గ్రామాలు వివాదాస్పద గ్రామాలుగా పేరుగాంచాయి. ఈ గ్రామాల్లో మొత్తం 2,663 మందిఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రజలు రెండు రాష్ట్రాల నుంచి లబ్ధి పొందుతుంటారు. వీరికి రెండు ఓటరు కార్డులు, రేషన్ కార్డులు ఉన్నా యి.దాంతో తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశాయి. గ్రామస్తులు కొందరు మహారాష్ట్రలోని చంద్రపూర్, కొందరు ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థులకు ఓటు వేశారు. ఉదయం ఏడు గంటలకే ఓటర్లు ఇరు రాష్ట్రాల పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్ లో నిలబడి ఓటువేశారు. తెలంగాణ పరిధిలో మొత్తం 1,570మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు.మొత్తం 58.95 శాతం పోలింగ్ నమోదైంది. తొలిసారి ఒకే ఓటుగతంలో ఇక్కడి గ్రామస్తులు రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కును వినియోగించుకునేవారు.అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఏదో ఒకచోట మాత్రమే ఓటు వేశారు. ఎన్నికలకు ముందు గ్రామాలకు అధికారులు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఒకే వ్యక్తి రెం డు చోట్ల ఓటువేయడం నేరమని వివరించారు. అధికారుల మాటలు అర్థం చేసుకున్న గ్రామస్తులు వారికినచ్చిన రాష్ట్రానికి ఓటేశారు.

Latest Updates