టీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకోని కాంగ్రెస్ కు ఓటు వేయండి: జగ్గారెడ్డి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ దగ్గర పైసలు తీసుకుని కాంగ్రెస్ కు ఓటు వేయండి అని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ ఎస్ దగ్గర  చాలా డబ్బులున్నాయి…ఓటుకు అయిదు నుంచి పది వేలు ఇస్తారన్నారు. టీఆర్ఎస్ ఉన్న GHMC కార్పోరేటర్లు అంతా 80మంది కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారన్నారు. అధికారంలో ఎవరు ఉంటే..ఆ పార్టీ మేయర్ జీహెచ్ఎంసీ లో ఉంటారని తెలిపారు. గొప్పలు మాట్లాడి..ప్రభుత్వాన్ని మంత్రి తలసాని బదనాం చేస్తున్నారన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చూపిస్తామన్న తలసాని 15వేలకు మించి చూపెట్టలేకపోయారని ఆరోపించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో.. మీకు అభ్యర్థులు లేక మా పార్టీ నేతలకే  మీరు టిక్కెట్ ఇచ్చారనే విషయం తలసాని మర్చిపోవద్దన్నారు. ఈరోజు మీ దుకాణం నడుస్తోంది…భవిష్యత్ లో మా ప్రభుత్వం వచ్చాక మా దుకాణం నడుస్తదన్నారు.

ఎంతటివారైనా ఏదో ఓక రోజు ఓడాల్సిందే..

గ్రేటర్ ఎన్నికల్లో ఏవరికి ,ఎలా షాకిస్తారో తెలవదన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. GHMC లో కాంగ్రెస్ మేయర్ వస్తే…ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ మేయర్ ను గెలిపిస్తే..ప్రతిపక్షంగా హైదరాబాద్ సమస్యల పై ప్రభుత్వం పై గట్టిగా పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ కు వెళ్లిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా బయట కనపడుతున్నారా అని ప్రశ్నించారు. మా పార్టీ లో మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలు.. 110మంది కి గట్టి జవాబు ఇస్తున్నామన్నారు.

అంతేకాదు LRS విషయంలో మాట్లాడేందుకు  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను సమయం ఇవ్వాలని కోరుతామన్నారు జగ్గారెడ్డి. అయితే నాకు హరీష్ రావు కు పంచాయతీ ఓడవదు..అందుకే మా మంత్రి ని కలవనని తెలిపారు. తాను స్ట్రెయిట్ ఫార్వార్డ్.. హరీష్ రావు అలా ఉండడని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.

Latest Updates