ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా

ఓటుకు నోటు కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ఈ కేసు ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇవాళ(శుక్రవారం) జరిగిన విచారణ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహ డిశ్చార్జి పిటిషన్లపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా… సండ్ర చెబుతున్న అంశాల్లో వాస్తవం లేదని ఏసీబీ అధికారులు ఆరోపించారు.

తన ప్రమేయం లేకుండానే తనను ఈ కేసులో ఇరికించారంటూ సండ్ర వెంకటవీరయ్య చెబుతోంది అవాస్తవమని, ఆయన ప్రమేయం ఉన్నందునే అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు ఏసీబీ అధికారులు. వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని తెలిపారు. సండ్ర, ఉదయసింహ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లను కొట్టివేయాలని ఏసీబీ అధికారులు కోర్టును కోరారు. వాదనలు విన్న తర్వాత  కోర్టు విచారణను వాయిదా వేసింది.

Latest Updates