ఓటర్ నమోదు, మార్పులు యాప్ ద్వారా చేసుకోవచ్చు

ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేయించుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ ఆర్డిఓ చంద్రకళ తెలిపారు. ప్రజలకు ఓటర్ ఐడీ కార్డు నమోదు చేసుకోవడానికి ఓటర్ నమోదు కోసం ప్రత్యేక యాప్లను రూపొందించడం జరిగిందన్నారు. దీంతో నూతనంగా ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకునే వాళ్ళు కింద తెలిపిన యాప్ ల ద్వారా నమోదు చేసుకోవచ్చని, అలాగే ఓటర్ ఐడి కార్డులో జన్మదిన, అడ్రస్ మార్పు కోసం కూడా ఈ యాప్ లు ఉపయోగపడతాయన్నారు.

ప్రజలు ముఖ్యంగా తమ ఇంటి దగ్గరికి బి ఎల్ వో లు వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలని, యాప్ అవగాహన లేని ప్రజలు ఎవరైనా ఉంటే వారు ఆర్డిఓ కార్యాలయని సందర్శిస్తే సిబ్బంది తగు సూచనలు అందజేస్తారన్నారు. ఈ నమోదు ప్రక్రియ ఆఖరి గడువు సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం తెలిపారు.ఓటర్ వివరాల కోసం www.nvsp.in సందర్శించాలని https://www.nvsp.in/account/Login ద్వారా వెబ్సైట్ నందు లేక పోతే స్మార్ట్ ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి https//play.google.com/store/apps/details?Id=com.eci.citizen డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ అవకాశం కేవలం 30.09.2019 వరకు ఉంటుందని తెలిపారు.

Voter registration & changes can be made through the App, says RDO

Latest Updates