నోటా నొక్కుతలేరు

Voters Doesn't use NOTA option in Elections
  • ఒక్క ఎన్నికల్లో మాత్రమే దానికి 3శాతం కన్నా ఎక్కు వ ఓట్లు
  • ఒక్క తెలంగాణలోనే నోటాకు పెరిగిన ఓట్లు.. 2.24 లక్షలు
  • నోటాకే ఎక్కు వ ఓట్లొచ్చినా ఎన్నికల్లో ప్రభావం శూన్యం
  • అందుకే దానికి బదులు నేతలకే ఓట్లేస్తున్న జనం

సెంట్రల్ డెస్క్:వ్యవస్థ మార్పుకు  నాంది పలికేది ఓటు. ఆ రెండు అక్షరాలకు ప్రపంచ గతినే మార్చేశక్తి ఉంది. తమ మనోభావాలను ప్రకటించేందుకు ప్రజల చేతిలో ఉన్న ఏకైక పదునైన ఆయుధం అది. నేతల జాతకాలు మార్చాలన్నా, ప్రజల గళం వినిపించాలన్నా, ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలన్నా ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే. అయితే ఎన్నికల బరిలో ఉన్న ఏ ఒక్కరూ నచ్చకపోతే ఎట్ల? ఇష్టం ఉన్నా లేకున్నా రేస్ లో ఉన్న వాళ్లలో ఎవరో ఒకరికి ఓటు వేయాల్సం దేనా? లేదంటే పోలింగ్‌‌కు దూరంగా ఉండాల్సిందేనా? నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే అవకాశం లేదా? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ పటాపంచలు చేస్తూ అందుబాటులోకి వచ్చిందే ‘నోటా’. అంటే ‘నన్ ఆఫ్ ది అబోవ్ (పైనోళ్లుఎవరూ కాదు)’ అని అర్థం . అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్నే నోటా అని అంటారు. 2013లో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం)అభ్యర్థుల గుర్తుతోపాటు నోటాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 37 అసెంబ్లీ లకు,2014లో లోక్ సభకు ఎన్ని కలు జరిగాయి. అయితే ఏటా నోటాకు ఓటు వేసే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటి వరకు కేవలం ఒక్క ఎన్నికలో మాత్రమే 3శాతం కంటే ఎక్కువ మంది నోటాకు ఓటేశారు.

ఐదు రాష్ర్టాల్లో 2.5 లక్షల మంది తగ్గారు

ఇప్పటి వరకు 38 సార్లు ఎన్నికలు జరిగితే అందులో మొత్తం పోలైన  ఓట్లలో నోటాకు పడింది కేవలం 1.17 శాతం మాత్రమే. చత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం,రాజస్థాన్, తెలంగాణ  రాష్ర్టాల్లో గతేడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 10.98 కోట్ల ఓట్లు పోలైతే, ఇందులో నోటాకు 15.2 లక్షల ఓట్లు మాత్రమే పడ్డా యి. ఇదిమొత్తం ఓట్లలో కేవలం 1.38 శాతం మాత్రమే. అదే 2013-/14లో ఇవే రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 9.78 కోట్ల మంది ఓటు వేయగా, 17.9 లక్షల మంది నోటాకు వేశారు. ఇది మొత్తం ఓట్లలో 1.83శాతం. అంటే ఐదేళ్ల కిందటితో పోలిస్తే నోటాకు ఓటువేసే వారు 2.5 లక్షల మంది (0.4 శాతం) తగ్గా రు.

తెలంగాణలో తప్ప

ఐదేళ్ల కిందటి ఎన్నికలతో పోలిస్తే, ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో తెలంగాణ మినహా మిగతా నాలుగు రాష్ర్టాల్లో నోటా ఓటు శాతం తగ్గింది. ఐదేళ్ల కిందట చత్తీస్‌‌గఢ్ లో మొత్తం ఓట్లలో 3.7 శాతం నోటాకు పోలవగా, ఇటీవలి ఎన్నికల్లో 2 శాతం ఓట్లుపడ్డాయి. మధ్యప్రదేశ్ లో 1.9 శాతం నుంచి 1.4శాతానికి నోటా ఓట్లు తగ్గా యి. రాజస్థాన్ లో 2013లోనోటాకు 1.91 శాతం ఓట్లు పడగా, 2018లో 1.3శాతం పోలయ్యాయి. తెలంగాణలో మాత్రమే నోటా ఓట్ల శాతం పెరిగింది. 2014లో 0.78 శాతం (1.52లక్షలు) నమోదు కాగా, 2018లో 1.1 శాతం (2.24లక్షలు) ఓట్లు పడ్డా యి.

మూడు చోట్ల మాత్రమే మెరుగు

చత్తీస్ గఢ్, బీహార్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రమే నోటా ఓట్లు 2 శాతానికి మించినమోదయ్యా యి. మరో ఆరు రాష్ర్టాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో 1.5 శాతం నుంచి 2 శాతం లోపు నమోదయ్యాయి. 10 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1నుంచి 1.5 శాతం లోపు, 17 రాష్ర్టాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో 1 శాతం లోపు రికార్డయ్యా యి. అత్యల్పం-గా హర్యానాలో పోలైన మొత్తం ఓట్లలో కేవలం 0.37శాతం మాత్రమే నోటాకు పడ్డా యి. ఈ లెక్కన చిన్నచిన్నగా నోటా ప్రభ తగ్గిపోతోందన్నది నిజం!

2013లో చత్తీస్​గఢ్ లో 3 శాతానికి మించి నోటా ఓట్లు నమోదయ్యాయి.

2014 లోక్​సభ ఎన్నికల్లో 54 నియోజకవర్గా ల్లో ఒక్కో చోట 20 వేలకుపైగా ఓట్లు నోటాకు పడ్డా యి.

2015 తర్వాత జరిగిన ఏ ఎన్నికలోనూ నోటా ఓట్లు 2 శాతానికి మించలేదు.

ఎందుకు తగ్గుతున్నారు

ఉదాహరణకు ఓ సెగ్మెంట్ కు జరిగిన ఎన్ని క-ల్లో 100 ఓట్లు పోలయ్యాయని అనుకుందాం .అందులో నోటాకు 60 ఓట్లు, ‘ఏ’అనే అభ్యర్థికి30 ఓట్లు, ‘బీ’అనే అభ్యర్థికి 10 వచ్చాయి. ప్ర-స్తుతం ఉన్న విధానం ప్రకారం ‘బీ’అనే అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన ‘ఏ’ని ఎన్నికలసంఘం విజేతగా ప్రకటిస్తుంది. నోటాకు ఎక్కువఓట్లు వచ్చాయన్న కారణంతో ఆ ఎన్ని కను రద్దుచేయదు. అంటే నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా, అదిఎన్ని కపై ఎలాంటి ప్రభావం చూపబోదు. నోటాఅనేది ‘తిరస్కరణ’ఓటు వేసేం దుకు ప్రభుత్వంమనకు కల్ప ించిన అవకాశం మాత్రమే. దీంతోమొదట్లో నోటాకు ఓటు వేసిన చాలా మంది,ఇప్పుడు ఏదో ఒక పార్టీకి వేస్తున్నారు . పోటీలోఉన్న అభ్యర్థుల్లో మంచి వారిని ఎన్ను కోవడంమంచిదని భావిస్తున్నారు.

 

 

Latest Updates