ఫస్ట్ ఫేజ్ ప్రశాంతం..91 లోక్ సభ స్థానాలకు ముగిసిన పోలింగ్

  •  దేశవ్యాప్తం గా 91 లోక్ సభ స్థానాలకు ముగిసిన పోలింగ్
  • వెస్ట్​బెంగాల్, త్రిపురలో గరిష్టంగా 81 శాతం ఓటింగ్
  • బీహార్​లో కనిష్టంగా 50 శాతం.. బారాముల్లా స్థానంలో 34 శాతమే
  • ఈవీఎంల పనితీరుపైనే చాలా చోట్ల ఫిర్యాదులు

ఒకటిరెండు చోట్ల హింస, మరికొన్ని కేంద్రాల్లో చెదురుమదురు ఘటనలు మినహా దేశ వ్యాప్తంగాసార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం ప్రశాతంగా ముగిసిందని ఎన్నికల సంఘం(ఈసీ)ప్రకటించింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలు, నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు స్వేచ్ఛగా హక్కును వినియోగించుకున్నారని, సాయంత్రం 5 గంటలతర్వాత కూడా క్యూ లైన్లలో నిలబడ్డ అందరికీ ఓటేసే అవకాశం కల్పించినట్లు డిప్యూటీ ఎన్ని కల కమిషనర్​ ఉమేశ్​ సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు, ఎన్నికల సిబ్బంది, భద్రతా బలగాలకు ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రాల వారీగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో అత్యధికంగా 81 శాతంపోలింగ్ నమోదు కాగా, బిహార్​లో అత్యల్పంగా 50శాతం మాత్రమే రికార్డైందని సిన్హా చెప్పా రు. ఫస్ట్​ ఫేజ్లో బెంగాల్ లో రెండు, బిహార్​లో నాలుగు లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండు రోజుల కిందట ఛత్తీస్ గఢ్​లో బీజేపీ ఎమ్మెల్యే ల్యాండ్ మైన్ కు బలైన శ్యామగిరి (దంతెవాడ జిల్లా , బస్తర్​ లోక్ సభ)లో 77శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పా రు. పోలింగ్ జరిగినంతసేపూ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించామని, ఈవీఎంల పనితీరుపైనే ఎక్కువ అభ్యం తరాలువచ్చాయని తెలిపారు.

పట్టుబడ్డ మొత్తం రూ.2,626 కోట్లు

పోలింగ్ ముగిసే దాకా ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగించామన్న ఈసీ అధికారులు, ప్రక్రియమొదలైన నాటి నుం చి గురువారం సాయంత్రం 6గంటల దాకా దేశవ్యాప్తంగా రూ.2,626 కోట్ల మొత్తాన్ని స్వాదీనం చేసుకున్నట్లు చెప్పా రు. అందులోనగదు 607 కోట్లు కాగా, మిగతాది లిక్కర్​, డ్రగ్స్,ఇతర వస్తు​ రూపంలో దొరికిందన్నారు. ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల హింసలో ఇద్దరు హత్యకు గురికాగా, యూపీఎన్నికల్లో ఓ కార్యకర్త గుండెపోటుతో చనిపోయాడని,వీటితోపాటు 25 చోట్ల హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు చెప్పారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు ఆంధ్రప్రదేశ్​తోపాటుఅరుణాచల్ ప్రదేశ్​, బిమార్​, మణిపూర్​, వెస్ట్​బెంగాల్లోనూ జరిగాయన్నారు.

రాష్ట్రాల వారీగా ఓటింగ్ పర్సంటేజ్

​ వెస్ట్ బెంగాల్ (2 సీట్లు) 81 శాతం, త్రిపుర(1) 81శాతం, అండమాన్ నికోబార్​(1) 70.67 శాతం,ఉత్తరా ఖండ్ ( 5) 57 .85, జమ్మూకాశ్మీర్​(2)54.49, సిక్కిం(1) 69 శాతం, నాగాలాం డ్ (1) 78,అస్సాం (5) 68, మహారాష్ట్ర (7) 56 శాతం, ఒడిశా(4) 68 శాతం, యూపీ(8) 63.69 శాతంగా ఓటింగ్ నమోదైన్లు అధికారులు తెలిపారు. తుది సమాచారాన్ని బట్టి పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందన్నారు.

Latest Updates