ఆఫీస్ సబార్డినేట్లుగా వీఆర్ఏలు..ఏ శాఖలోకైనా వెళ్లేందుకు చాన్స్ ఇచ్చిన సర్కార్​

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉన్న విలేజ్ ​రెవెన్యూ అసిస్టెంట్లు(వీఆర్ఏ‌‌)లు‌‌ ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు ప్రభుత్వం చాన్స్‌ ఇచ్చింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్లో 30% పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న వీఆర్ఏలు అగ్రికల్చర్, ఇరిగేషన్​, ఎడ్యుకేషన్, పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ తదితర శాఖల్లో పని చేసేందుకు ఆప్షన్ ఇస్తున్నారు. డిగ్రీ, సీనియారిటీ ఉన్న వీఆర్ఏలు మాత్రం.. తమకు జూనియర్​ అసిస్టెంట్‌గా ప్రమోషన్ వస్తుందన్న నమ్మకంతో ఆప్షన్ల జోలికి వెళ్లడం లేదని తెలిసింది.

Latest Updates