సూసైడ్ నోట్ రాసి వీఆర్వో మిస్సింగ్.. ఫోన్ స్విచ్ఛాఫ్

గుంటూరు జిల్లాలో ఓ VRO అదృశ్యం కలకలం రేపుతోంది. బొల్లపల్లి మండలం వెల్లటూరు వీర్వోగా పనిచేస్తున్న సుభానీ అనే వ్యక్తి సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. అతడి సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఓ వ్యవహారం లో తహశీల్దార్(MRO)తో పాటు మరో VRO కూడా తనను వేధిస్తున్నాడని సూసైడ్ నోట్ లో రాశాడు.

సత్తెనపల్లి సంగం బజారులో నివాసముంటున్న సుభాని కుటుంబం అతడు కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా తన భర్త ఆచూకీ తెలియకపోవడంతో  సుభాని భార్య మిరాబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates