వీఆర్వో వ్యవస్థ రద్దు..మధ్యాహ్నంలోగా రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి: కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల్లోపు వీఆర్వోల దగ్గరున్న  రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని జిల్లాల కలెక్టర్‌లకు చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకల్లా వీఆర్వోల వద్ద ఉన్న అన్ని రికార్డులు స్వాధీనం చేసుకుని.. సాయంత్రం 5 గంటల కల్లా రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ యాక్ట్ ను ప్రవేశపెడుతున్న నేపధ్యంలో వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలన్నీ పూర్తి చి ఆమోద ముద్ర వేసింది. సీఎం నుండి ఉత్తర్వులు రావడంతో ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ ఆదేశాలిచ్చారు. వెంటనే వీఆర్వో ల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

 

 

Latest Updates