సెక్రటేరియట్ కు VRO అసోసియేషన్ నాయకులు

హైదరాబాద్ లోని సెక్రటేరియట్ కు పెద్దసంఖ్యలో వచ్చారు VRO అసోసియేషన్ నాయకులు. ఓ రైతు భూ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా వీఆర్వోల పనితీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో  సీఎస్ ను కలిసేందుకు సెక్రటేరియట్ కు చేరుకున్నారు వీఆర్వోలు.

రైతులు, భూప్రక్షాళన వ్యవహారాల్లో గ్రౌండ్ లెవెల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రప్రభుత్వానికి వివరించేందుకు సెక్రటేరియట్ వచ్చామని VRO అసోసియేషన్ నాయకులు చెప్పారు.

సెక్రటేరియట్ లో సీఎస్ SK జోషీని కలిసి తమ సమస్యలు వివరిస్తామన్నారు VRO నేతలు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో… సీఎస్  సమావేశం సుదీర్ఘంగా సాగడంతో.. సెక్రటేరియట్ లో తమ సమయం వచ్చేవరకు ఎదురుచూశారు VRO అసోసియేషన్ నేతలు.

Latest Updates