ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు

షాద్ నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన ఘోరం చూశాక.. ఆడ బిడ్డలను బయటకు పంపాలంటేనే భయమేస్తోంది. కర్కశంగా సాయంత్రం నుంచి కూర్చుని ప్లాన్ చేసి.. అఘాయిత్యానికి పాల్పడిన తీరు విన్నాక.. తోటివారిని నమ్మాలంటే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కూతుర్ని మానవ సమాజంలోకి పంపుతున్న ఫీలింగ్ రావట్లే తల్లిదండ్రులకు!! రాబందుల రాజ్యంలోకి.. రాకాసుల మూక మధ్య పంపుతున్న భయం కలుగుతోంది. షాద్ నగర్‌లో జరిగిన ఘటనలో క్రూరత్వం అంత భయానకంగా ఉంది.

అంతటి ఘోరంగా ఓ బిడ్డను హింస పెట్టిన ఘటనపై ఓ వైపు జనాగ్రహం పెల్లుబుకుతోంది. ఇవాళ ఉదయం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర స్వచ్ఛందంగా ప్రజలు నిరసనకు దిగడమే దీనికి నిదర్శనం.  ‘ఆ మానవ మృగాలను మాకు అప్పగిస్తారా? మీరే ఎన్‌కౌంటర్ చేస్తారా?’ అని నినాదాలు చేశారు వేలాది జనం. నిందితులు నలుగురు మహ్మద్, శివ, నవీన్, చెన్నకేశవులును వెంటనే షాద్ నగర్ స్టేషన్‌ దగ్గరే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది నాణేనికి ఓ వైపు అయితే… రెండో వైపు ఈ ఘటనలోనూ పైశాచికానందాన్ని వెతుక్కుంటున్న మృగాలు బయటపడుతున్నాయి.

ముసుగులు వేసుకున్న మృగాలున్నాయమ్మా..

నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతున్న రేప్ ఘటనల్లో మానవ మృగాలు వాటి పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంటున్నాయి. ఈ ఘటనల్లో ఎన్నింటికి శిక్ష పడుతోందో.. ఎన్నాళ్లకు పడుతోందో చూస్తూనే ఉన్నాం. కానీ, ఇవే కాదు మన చుట్టూ నిత్యం మన చుట్టూ మంచిగానే కనిపిస్తూ ముసుగులు వేసుకుని తిరుగుతున్న మృగాలు చాలా ఉన్నాయ. అలాంటి రాబందులు కొన్ని సోషల్ మీడియాలో వాటి అసలు రూపాన్ని బయటపెట్టాయి.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

రేప్ చేస్తే ఏ దేశంలో ఏ శిక్ష?

షాద్‌నగర్‌ పీఎస్ దగ్గర నిరసనకారులపై లాఠీచార్జ్

షాద్ నగర్ ఘటనపై వికృతంగా పోస్టులు, కామెంట్లు చేసి.. పైశాచికానందాన్ని పొందాయి. అలాంటి కొందరిపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్‌కు చెందిన కొందరు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫేస్‌బుక్ పోస్టులపై పిర్యాదు చేశారు. వీటిని పెట్టింది ఎవరన్నది తేల్చి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.

వదిలేస్తే రేప్ చేస్తారేమో అరెస్టు చేయండి

చాలా మంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు నష్టపోతున్నారని, రేప్ చేయడం తప్పుకాదని అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు స్మైలీ నాని అనే ఫేస్‌బుక్ యూజర్. హార్మోన్స్ వల్ల కంట్రోల్ చేసుకోలేక రేప్ చేస్తారని సమర్థించేలా మాట్లాడాడు అతడు. ఇంకా కొందరు మరీ అసభ్యమైన కామెంట్లు కూడా పెట్టారు. వీళ్లు కూడా ఎవరైనా కనిపిస్తే రేప్‌ చేస్తారేమో, వెంటనే అరెస్టు చేయాలంటూ ఎల్బీనగర్ వాసులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Latest Updates