50 శాతం వీవీప్యాట్ లు లెక్కిస్తే అభ్యంతరమేంటి?: సుప్రీం

వీవీ ప్యాట్( వోటర్ వెరీఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్)  లలోని ఓటర్ స్లిప్పుల లెక్కింపుపై కీలక తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతీ నియోజకవర్గంలో  50 శాతం  వీవీప్యాట్ లలోని ఓటర్ స్లిప్పులను లెక్కిస్తే అభ్యంతరాలేంటో అఫిడవిట్ దాఖలు చేయాలని  ఈసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది .

ప్రతీ నియోజకవర్గ పరిధిలో కనీసం 50 శాతం వీవీప్యాట్ లను లెక్కించాలంటూ  ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు 21 పార్టీల నేతలు(షరద్ పవార్, అఖిలేష్ యాదవ్, షరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా) సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ‘ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నకల అధికారులు కేవలం ఒక వీవీ ప్యాట్ ను మాత్రమే కౌంట్ చేస్తున్నారు. దీని వల్ల ఆ నియోజవర్గంలోని పోలైన ఓట్లలో  0.44 శాతం ఓటర్ స్లిప్పులను మాత్రమే కౌంట్ చేస్తున్నారు. తక్కువ స్లిప్పులు కౌంట్ చేయడం వల్ల ఓట్లు ఎన్ని పోలయ్యాయనేది ఎలా తెలుస్తుంది‘ అని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రతీ నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్ లను కౌంట్ చేస్తే అభ్యంతరాలు ఏంటో చెప్పాలని ఈసీని ఆదేశించింది.

Latest Updates