మయాంక్‌‌ అచ్చం వీరేంద్రుడిలా..

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో డబుల్‌‌ సెంచరీతో అదరగొట్టిన యువ ఓపెనర్‌‌ మయాంక్‌‌ అగర్వాల్‌‌ను చూస్తే.. మాజీ క్రికెటర్‌‌, విధ్వంసకర బ్యాట్స్‌‌మన్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌‌ గుర్తుకొస్తున్నాడని వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ అభిప్రాయపడ్డాడు. తన అరాధ్య క్రికెటర్‌‌ అయిన సెహ్వాగ్‌‌ మాదిరిగా మయాంక్‌‌ కూడా నిర్భయమైన క్రికెట్‌‌ ఆడుతున్నాడని కొనియాడాడు.  ‘మయాంక్‌‌ ఓ సాలిడ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌. డొమెస్టిక్‌‌ మ్యాచ్‌‌ ఆడినంత ఈజీగా తొలిటెస్టులో ఆడాడు. సాధారణంగా డొమెస్టిక్‌‌, ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో ఆడినప్పుడు ఫార్మాట్లకు తగ్గట్టుగా బ్యాట్స్‌‌మెన్‌‌ తమ విధానాన్ని  మార్చుకుంటారు. కానీ, రెండింటిలోనూ మయాంక్‌‌ తనదైన స్టైల్‌‌లో ఆడుతున్నాడు.

మానసిక దృఢత్వం, స్థిరత్వం అతని ప్లస్‌‌ పాయింట్లు. తన ఫేవరెట్‌‌ క్రికెటర్‌‌ సెహ్వాగ్‌‌లాగే మయాంక్‌‌ కూడా ఫియర్‌‌లెస్‌‌ క్రికెట్‌‌ ఆడుతున్నాడు’ అని లక్ష్మణ్‌‌ వ్యాఖ్యానించాడు. మరోవైపు సుదీర్ఘకాలంపాటు డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌ ఆడిన అనుభవం అగర్వాల్​కు ఇప్పుడు సానుకూల ఫలితాలను ఇస్తోందని వెటరన్‌‌ స్పిన్నర్‌‌ హర్భజన్‌‌ సింగ్‌‌ అభిప్రాయపడ్డాడు. ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లోకి చాలా లేట్‌‌గా వచ్చినా, అవకాశం లభించినప్పుడు దాన్ని అర్ధం చేసుకుని ఆడగల నేర్పు మయాంక్‌‌  సొంతమని ప్రశంసించాడు. తన పాత్ర గురించి చక్కని అవగాహన ఉండడంతో తొలిటెస్టులో మయాంక్‌‌ అద్భుతంగా ఆడాడని భజ్జీ తెలిపాడు.

 

Latest Updates