ఈ లెట‌ర్ ఉంటే సొంతూళ్ల‌కు పోవ‌చ్చు

క‌రోనా క‌ట్ట‌డిలో లో భాగంగా ఎక్క‌డిక‌క్క‌డే లాక్ డౌన్ చ‌ర్య‌లు చేప‌ట్టిన పోలీసులు.. హైద‌రాబాద్ నుండి సొంత ఊరికి వెళ్లేవారికి ఒక్క అవ‌కాశం ఇచ్చారు. హైద‌రాబాద్ హాస్ట‌ళ్ల‌లో ఉన్న విద్యార్థులు, ఎంప్లాయీస్ సొంతూళ్ల‌కు వెళ్లేందుకు వెసులుబాటు క‌ల్పించారు. అయితే కేవ‌లం బైక్, కారు ఉన్న‌వాళ్ల‌కే ఈ అవ‌కాశం క‌ల్పించారు.

ఇందుకోసం స్థానిక పోలీస్ స్టేస‌న్ కు వెళ్లి వెహికిల్ నెంబ‌ర్, ఆధార్ నెంబ‌ర్ , మిగ‌తా వివ‌రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్పుడు పోలీసులు NOC స‌ర్టిఫికెట్ ఇస్తారు. ఊళ్ల‌కు వెళ్తుండ‌గా పోలీసులు అడ్డుకుంటే ఈ స‌ర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది. అయితే ఈ విష‌యం తెలియ‌గానే ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌ముందు NOC కోసం హాస్టల్ విద్యార్థులు బారులు తీరుతున్నారు.

Latest Updates