నిద్రపోవడమే జాబ్.. జీతం లక్ష: ఇండియన్స్ అంతా అప్లై చేసుకోవచ్చు

  • నిద్రపై స్టడీ చేస్తున్న బెంగళూరు స్టార్టప్
  • సెలెక్ట్ అయిన ఉద్యోగులు రోజూ రాత్రి 9 గంటలు నిద్రపోతే చాలు

నిద్ర పోవడం మీకు బాగా ఇష్టమైన పనా? అయితే మంచిగా నిద్ర పోయేవాళ్లకు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. మీరు మామూలుగా చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రతి రోజూ రాత్రి 9 గంటల పాటు ఫుల్లుగ నిద్రపోతే లక్ష రూపాయల జీతం ఇస్తామంటోంది. అయితే 100 రోజులపాటు ఈ డ్యూటీ కచ్చితంగా చేయాలి.

ఇదెక్కడో ఫారెన్‌లో కాదు. మన ఇండియాలోనే.. బెంగళూరుకు చెందిన ‘వేక్‌ఫిట్’ అనే కంపెనీ ఈ ప్రకటన ఇచ్చింది. డబుల్ కాట్ బెడ్ పరుపులను తయారు చేసే కంపెనీ ఇది. కస్టమర్లకు మంచి మ్యాట్రెస్ తయారు చేయడం కోసం స్లీప్ ప్యాట్రన్స్‌పై స్టడీ చేస్తున్నామని చెబుతున్నారు ఆ కంపెనీ డైరక్టర్ చైతన్య రామలింగ గౌడ.

దేశంలో ఎవరైనా ఆప్లై చేసుకోవచ్చు

‘వేక్‌ఫిట్’ కంపెనీ పెట్టిన ఈ ‘స్లీప్ ఆఫర్’కు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడున్న వారైనా తమ కంపెనీ వెబ్‌సైట్ Wakefit.co చేసుకోవచ్చని చెబుతోంది. 100 రోజుల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం-2020 కోసం ప్రత్యేకంగా వాళ్ల ఆఫీసుకు కూడా వెళ్లక్కర్లేదు. అభ్యర్థులు బాగా నిద్రపోగలరని నిరూపించికునేందుకు ఓ డిష్క్రిప్షన్ రాసి పంపితే ఇంటికే ఆ కంపెనీ మ్యాట్రెస్, స్లీప్ ట్రాకర్స్ పంపుతారు. సెలెక్ట్ అయిన వాళ్లు నిద్రపోయే సమయం మొత్తాన్ని వీడియో తీసి పంపాల్సి ఉంటుంది.

MORE NEWS:

షీ టీమ్ నంబర్ ఇదే.. మన బిడ్డలకు చెప్పండి

మంచిగా నిద్ర పోవాలంటే… చిన్న చిన్న టిప్స్..

కండిషన్స్ అప్లై

  • డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అప్పుడప్పుడు క్లాసుల్లో నిద్రపోయిన వాళ్లయితే దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా లెక్కలోకి తీసుకుంటారట.
  • సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చోకుండా రాత్రులు టైమ్‌కు నిద్రపోయే వాళ్లకు ప్రిఫరెన్స్.
  • పైజామాలు వేసుకుని పడుకోవాలి. ఎటువంటి వాతావరణంలోనైనా అంటే గోలగోలగా ఉన్నా, లైట్ ఉన్నా నిద్రపోగలగాలి.
  • పడుకున్నాక 20 నిమిషాల్లోపే నిద్రలోకి వెళ్లిపోవాలి. గురక పెట్టే అలవాటుంటే మైనస్ పాయింటే.

అప్లై చేసుకోవాలనుకునేవాళ్లు ఈ లింక్‌పై క్లిక్ చేయొచ్చు: https://www.wakefit.co/sleepintern/

Latest Updates