గోడకూలి ముగ్గురు చిన్నారులు మృతి

హైదరాబాద్ హబీబ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అఫ్జల్ సాగర్ మాన్గార్ బస్తీలోని  ఓ ఇంట్లో  గోడ కూలి నిద్రిస్తున్న చిన్నారులపై పడింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రోషిణి, సారిక, నాలుగు నెలల చిన్నారి పావని చనిపోయారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.  రోజు కూలితో  పొట్టపోసుకునే మిఠాయి లాల్, సీమ దంపతులు సిమెంట్ ఇటుకలతో శ్లాబ్ ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ ఇంట్లోనే గబ్బార్, సురేఖ కుటుంబం కూడా ఉంటోంది.  ప్రమాదంలో మిఠాయిలాల్ ముగ్గురు పిల్లలు చనిపోగా…. గబ్బార్ కి  చెందిన  ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Latest Updates