నాయకుడిగా ఎదగాలంటే ఆఫీసర్ల కాలర్ పట్టుకోవాలి: మినిస్టర్ కామెంట్స్

చత్తీస్ గడ్ ఎమ్మెల్యే ఒకరు ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో  విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి వార్తల్లో నిలిచారు.  చిన్నపిల్లలు రాజకీయ నాయకులు కావాలంటే వారు “కలెక్టర్ మరియు ఎస్పీల కాలర్లను పట్టుకోవాలని” చెప్పారు.

సుక్మా జిల్లాలోని ఒక పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో  పాల్గొన్న మంత్రి ఈ విచిత్రమైన వ్యాఖ్య చేశారు.  కార్యక్రమంలో ఓ విద్యార్థి.. విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే  ఏం చేయాలన్న ప్రశ్నకు సమాధానంగా… ” మీరు పెద్ద రాజకీయ నాయకుడిగా మారాలనుకుంటే, కలెక్టర్,  పోలీసు సూపరింటెండెంట్ యొక్క కాలర్లను పట్టుకోండి” (బడా నేతా బన్నా కలెక్టర్, ఎస్పి కా కాలర్ పక్డో ) అంటూ విచిత్ర మైన వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీనిపై స్పందించిన మంత్రి..  పిల్లలను వారు ఏమి కావాలనుకుంటున్నారో తాను అడిగానని, అందుకు సమాధానంగా కొందరు పిల్లలు తాము నాయకులు కావాలని కోరుకుంటారని చెప్పారన్నారు.  వారిలో ఒకరు నేనెలా నాయకుడిగా ఎదిగానని అడగగా..   నాయకులు కావాలనుకుంటే ప్రజలకు సేవ చేయమని వారికి చెప్పానన్నారు. ప్రజల కోసం కలెక్టర్ కార్యాలయాల వద్ద, స్టేషన్ ల వద్ద పోరాడమని చెప్పానన్నారు. అయితే తన స్టేట్మెంట్ ను కొందరు తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆయన అన్నారు.

Latest Updates