రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు చేతులు మారాయి

రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్  ఆస్తులు అన్యాక్రాంతమవడం బాధాకరమని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మెంబర్లు నౌషాద్, వసీం, హనీఫ్ చెప్పారు. నాంపల్లిలోని వక్ఫ్​బోర్డ్​ఆఫీసులో చైర్మన్​మహమూద్​సలీంతో సెంట్రల్​వక్ఫ్​ కౌన్సిల్ ​సోమవారం సమావేశమైంది. రాష్ట్రంలోని వక్ఫ్​ప్రాపర్టీ వివరాలను కౌన్సిల్​మెంబర్లు బోర్డ్​చైర్మన్​ను అడిగి తెలుసుకున్నారు. ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం కావడాన్ని ప్రశ్నించారు. రికార్డు రూంను ఎలా సీజ్​చేస్తారని సభ్యులు నిలదీశారు. తమ రికార్డుల ప్రకారం బోర్డుకు రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి ఉందన్నారు. కానీ వక్ఫ్​బోర్డుకు 40 వేల ఎకరాలు ఉన్నాయని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మిగిలిన 37 వేల ఎకరాలు,  ఇతర ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆస్తుల వివరాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు

Latest Updates