దిశ ఎఫెక్ట్.. రాష్ట్రంలో ఫస్ట్ జీరో FIR నమోదు

వరంగల్: ఓ యువతిమిస్సింగ్ కేసులో వరంగల్ పోలీసులు రాష్ట్రంలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ అమ్మాయి కనిపించడం లేదంటూ స్టేషన్ కు వచ్చిన పేరెంట్స్​ను సుబేదారి ఎస్సై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కేసు తమ పరిధి కాకపోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గోవిం దాపురానికి చెందిన బూరరవీందర్ కుమార్ తె శ్రీవిద్య శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడంలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా శ్రీవిద్య ఆచూకీ దొరకకపోవడంతోమధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోరవీందర్ సుబేదారి స్టేష న్ లోఫిర్యాదు చేశారు. అడ్మిన్ ఎస్సై
సత్యనారాయణ కంప్లైంట్ తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కేసును సంబంధిత స్టేషన్ కు ట్రాన్స్​ఫర్ చేశారు. అయితే..సాయంత్రం 6.15 సమయంలో సదరు యువతి సుబేదారి స్టేషన్ లో పోలీసులను ఆశ్రయించింది. తాను ఇష్టపూర్వకంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు తెలిపింది.

Latest Updates