వరంగల్ తొమ్మిది మంది హత్యకేసులో నిందితుడికి ఉరిశిక్ష (వీడియో)

తెలంగాణలో సంచలనం సృష్టించిన  వరంగల్  గొర్రెకుంట బావి తొమ్మిది మంది హత్య కేసులో నిందుతుడు సంజయ్ కుమార్ యాదవ్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అసలేం జరిగింది ?

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో వచ్చాడు. గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నాడు. అక్కడే గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్ ‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మక్సూద్ భార్య అక్క కూతురు రఫికా కూడా నివాసం ఉంటుంది. ఈ కుటుంబంతో బీహార్ కు చెందిన సంజయ్ యాదవ్  పరిచయం పెంచుకున్నాడు.

ఆ పరిచయంతో మక్సూద్ భార్య అక్క కూతురు రఫికాతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో రఫికా  కుమార్తె తో చనువగా ఉండడం మొదలుపెట్టాడు. అనుమానం వచ్చిన రఫికా..,సంజయ్ ను నిలదీసింది. దీంతో  తన పెద్దలతో పెళ్లి  సంబంధం మాట్లాడాలి వెళదాం అంటూ రఫికను రైలెక్కించి… మధ్యదారిలోనే హత్య చేసి రైలు నుంచి బయటకు తోశాడు. రఫికా కనిపించకపోయే సరికి మక్సూద్ భార్య సంజయ్‌ను నిలదీసింది. దీంతో కంగారు పండిన సంజయ్ ఎక్కడ తాను హత్య చేసిన విషయం బయకు వస్తుందోనని కుటుంబం మొత్తం చంపేందుకు ప్లాన్ వేశాడు. కొన్నిరోజుల పాటు గోదం వద్ద రెక్కీ నిర్వహించాడు. మర్డర్‌కు పక్కా ప్లాన్ వేశాడు.

పుట్టినరోజే వాళ్లకు చావు ముహుర్తం :

ఇంతలో మక్సూద్ భార్య మొదటి భార్య కుమారుడు పుట్టినరోజు వచ్చింది. దీనికి సంజయ్ కుమార్ కూడా హాజరయ్యాడు.అందరూ కలిసి రాత్రి విందు భోజనం చేసుకున్నారు. అయితే వారు తిన్న భోజనంలో సంజయ వారికి తెలియకుండా నిద్రమాత్రలు కలిపాడు. తిని అందరూ మత్తులోకి జారుకున్నాక  మహ్మద్ మక్సూద్​(56), ఆయన భార్య నిశా (46), కూతురు బుస్రా(22), మూడేళ్ల మనవడు బబ్లూ మృతదేహాలు బయటపడ్డాయి. మక్సూద్‌‌ కొడుకులు షాబాద్ ఆలం (21), సోహైల్ ఆలం (19)తో పాటు బీహార్‌‌కు చెందిన శ్రీరామ్‌‌​(21), శ్యామ్‌‌ (21) ఒక్కొక్కరిని తీసుకెళ్లి బావిలో పడేశాడు.  వారు బతికుంటే తన బండారం ఎలా అయిన బటయపడుతుందున్న భయంతో వారిద్దర్నీ కూడా బావిలో పడేశాడు. ఇలా రఫికా హత్యను కప్పి ఉంచేందుు సంజయ్ మొత్తం తొమ్మిది మందిని హతమార్చాడు.

రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ ‘గొర్రెకుంట బావి’ మిస్టరీ వీడింది. తొమ్మిది మందిని హత్య చేసింది ఒక్కడేనని తేలింది. బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక హత్య నుంచి తప్పించుకునేందుకు అంత మందిని చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు. కేసును త్వరగా సాల్వ్ చేసిన పోలీసులను వరంగల్ సీపీ రవీందర్ అభినందించారు. సంజయ్ ను పట్టుకోవడానికి కీలక ఆధారాలను తెలిపారు.

సంజయ్ ను పట్టించిన సైకిల్ సవారి 

సంజయ్‍ తెల్లగా ఉంటాడు. తన గ్లామర్‍కు అమ్మాయిలు ఈజీగా పడిపోతారనేది అతని నమ్మకం. ఎక్కడికైనా సైకిల్‍ మీదే వెళ్లేవాడు. తానుండే జాన్ పాక అనే ప్రాంతం నుంచి మర్డర్‍ జరిగిన ప్రాంతానికి రోజు సైకిల్‍ మీదే వచ్చి వెళ్లాడు. రెక్కీ నిర్వహించిన రోజులు, హత్యలు చేసినరోజు.. ఆ తెల్లారి కూడా ఇదే సైకిల్ పై రౌండ్ లు కొట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ సైకిల్‍ సవారీనే అతడిని పట్టించింది.

సీసీ కెమెరాల ఆధారంగా..

నాడు హత్య జరిగిన సమయంలో  హోంమంత్రి, డీజీపీ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వరంగల్ సీపీ దర్యాప్తు చేపట్టారు. లోకల్ పోలీసులు, టాస్క్​ఫోర్స్, సీసీఎస్, సైబర్ క్రైం,టెక్నికల్ టీం , హైదరాబాద్ నుంచి స్పెషల్ క్లూస్ టీం ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశాయి. సంజయ్ ఈ నెల 16 నుంచి 20 వరకు రోజూ సైకిల్ పై వెళ్లడం గోదాం , గొర్రెకుంట ఏరియాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. గురువారం ఉదయం 5 గంటల తర్వాత కూడా వెళ్లినట్లు కనిపించింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. సోమవారం మధ్యాహ్నం జాన్ పాకలోని తన ఇంట్లో ఉన్న సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అన్ని హత్యలూ తాను ఒక్కడే చేసినట్లు చెప్పాడని తెలిపారు వరంగల్ సీపీ రవీందర్.  నిందితుడిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

తాజాగా ఈ కేసుపై వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు నిందితుడు సంజయ్ కుమార్ ను ఉరితీస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

Latest Updates