ప్రాణం తీస్తున్న ప్రయాణం.. నాలుగు రోజుల్లో పదిమంది మృతి

Warangal Highway Accidents Ten Persons Killed in Four Accidents
  • రక్తమోడుతున్న రహదారులు
  • నాలుగు రోజుల్లో పదిమంది బలి
  • ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు
  • ట్రాఫిక్‍ నిబంధనలపై పట్టింపు కరువు

నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది. నాలుగు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో 10మందికి పైగా చనిపోవడం జనాలను కలత పెట్టిస్తోంది. ఇటీవల జరిగిన కొమ్మాల ఘటనలో నలుగురు, మొన్న పంతిని వద్ద ముగ్గురు, ఇంకా వేర్వేరు ప్రమాదాల్లో పలువురు మృతిచెందారు. ఓవర్ స్పీడ్, డ్రంకెన్ డ్రైవ్ , ట్రిపుల్ రైడింగ్​లతో ప్రాణాలు కోల్పోతున్నారు. హైవేలపై ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపడం కూడా యాక్సిడెంట్లకు ప్రధాన కారణాలవుతున్నాయి. కాగా, ట్రాఫిక్ రూల్స్​ సరిగా పాటించినట్లయితే ప్రమాదాలు జరుగకుండా కొంత మేరకు చూసుకోవచ్చని సంబంధిత ఆఫీసర్లు సూచిస్తున్నారు.

ఇటీవల వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల తీవ్రతను పరిశీలిస్తే ప్రమాదాలకు నిర్లక్ష్యమే ప్రధాన కారణం. గీసుకొండ కొమ్మాల జాతర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మరణించారు. మద్యం తాగిన వ్యక్తి స్పీడ్‌‌గా కారు నడుపుతూ బైక్ ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చనిపోయారు. మరొక ప్రమాదంలో ముగ్గురు యువకులు బైక్ వేగంగా వస్తూ చెట్టును ఢీ కొట్టి చనిపోయారు. ట్రాఫిక్‍ రూల్స్ ను పట్టించుకోకుండా ఒకే బైక్ ఇద్దరికి మించి ప్రయాణాలు చేస్తున్నారు. డ్రంక్‍ అండ్ డ్రైవ్ పోలీసులు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో గీసుకొండ ప్రమాదం నలుగురి చావుకు కారణమైంది.

ఇటీవల జరిగిన ప్రమాదాలు..

  • ఏప్రిల్‍ 20న గీసుకొండ మండలం కొమ్మాల స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి, ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
  • ఏప్రిల్‍ 24న పంథని దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించారు.
  • ఏప్రిల్‍ 25న తెల్లవారుజామున మడికొండ పోలీసు శిక్షణ కేంద్రం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
  • ఏప్రిల్‍ 25న జనగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు, మహబూబాబాద్‍ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు బలయ్యారు.

Latest Updates