వరంగల్ మేయర్ గుండా ప్రకాశ్ : ఎన్నిక ఏకగ్రీవం

వరంగల్ మేయర్ గా గుండా ప్రకాశ్ రావు ఎన్నిక ఏకగ్రీవమైనట్టు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు. మేయర్ ఎన్నిక కోసం GWMC హాల్ లో ఇవాళ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ గా గుండా ప్రకాష్ పేరును ప్రతిపాదించారు వద్దిరాజు గణేశ్. దీనిని మరో కార్పొరేటర్ మారుపల్ల భాగ్యలక్ష్మి బలపరిచారు. తర్వాత మేయర్ గా గుండా ప్రకాష్ యునానిమస్ గా ఎన్నికైనట్టు ప్రకటించారు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.

ఆ తర్వాత మేయర్ గా బాధ్యతలు తీసుకున్నారు గుండా ప్రకాష్. కొత్త మేయర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అభినందించారు.

 

Latest Updates