వరంగల్ ఎంజీఎంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన

Warangal MGM Hospital Contract employees protest for demanding the payment of pending salaries

వరంగల్: పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని, కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ ఎంజీఎం ఆసుప‌త్రిలోని కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న‌ ధ‌ర్నా రెండో రోజుకి చేరింది. ఆసుప‌త్రిలో పనిచేసే కాంట్రాక్టు‌ పారిశుద్ద్య కార్మికులు,సెక్యురిటీ సిబ్బంది విదులు బహిష్కరించి త‌మ నిర‌స‌న తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేప‌థ్యంలోనూ.. తమ ప్రాణాలు పణ్ణంగా పెట్టి చెత్త,చెదారాన్ని తొలగిస్తున్నప్పటికీ, తమకు కనీస వేతనాలు చెల్లించటం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త,చేదారం తొలగించి, పరిశుభ్రంగా చేసిన త‌మ‌ను.. ప్రభుత్వం ,అధికారులు చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు వాపోయారు. ఎంజీఎం హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులకు జిఓ 14 ప్రకారం 18000 వేల రూపాయల జీతం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆసుపత్రిలో పనిచేసే కార్మికులకు నెల శాలరీతో పాటు స్లిప్స్ ఇవ్వాలని, పీఎఫ్ కార్డు ఇప్పించాలన్నారు. ఎంజీఎం హాస్పిటల్ లోని పని చేస్తున్న ప్రతి కార్మికునికి పీపీ కిట్స్, ఎన్ -95 మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Warangal MGM Hospital Contract employees protest for demanding the payment of pending salaries

Latest Updates