వరంగల్ మిస్టరీ: తొమ్మిదిమందిని బతికుండగానే బావిలోకి నెట్టేశారు

వరంగల్ జిల్లా గొర్రెకుంటలో జరిగిన సామూహిక మరణాలన్నీ బతికుండగానే జరిగినట్లు ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ డాక్టర్ రజా మాలిక్ తెలిపారు. రెండు రోజుల క్రితం గొర్రెకుంటలోని ఓ పాడుబడ్డ బావిలో 9 శవాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఆ 9 మందిని బతికుండగానే బావిలో పడేసినట్లు ఎంజీఎం ఫోరెన్సిక్ హెడ్ తెలిపారు. మూడెేళ్ల బాలుడు మినహా మిగతా మృతుల శరీరాలపై కొన్ని గీతలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. వారందరినీ బావి దగ్గరకు ఈడ్చుకువచ్చి బావిలో పడేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. వారు తిన్న ఆహారంలో మత్తు పదార్ధాలు కూడా కలిసినట్లు డాక్టర్ రజా మాలిక్ తెలిపారు. మత్తులో ఉండగా.. బావిలో పడేయడంతో అందరి ఊపిరితిత్తులలోకి నీరు చేరి వారంతా మరణించారని ఆయన తెలిపారు. పూర్తి స్థాయి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

For More News..

ఏపీ సీఎం జగన్ కు ట్వీట్ చేసిన మెగాస్టార్

సీఎం మెరుపులెక్క వచ్చి ఏదేదో మాట్లాడిపోతున్నడు

Latest Updates