అబద్ధాలతో వరంగల్ ప్రజలను మోసం చేయలేరు

బీజేపీ ఎంపీ బండి సంజయ్ రెచ్చగట్టే వ్యాఖ్యలు మానుకోని.. హుందాగా వ్యవహరించాలని సూచించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆలయాలను అడ్డాగా చేసుకొని ప్రజలను మోసం చేయొద్దన్నారు. అఫీషియల్ గా కూర్చొని వాస్తవాలు బయట పెడదామన్నారు. టెంపుల్ వేదికగా మీరు-మేము వాదించుకోవడం మంచిది కాదని అన్నారు.

సంక్షేమం, విద్యుత్ సరఫరా, ప్రభుత్వ ఆస్పత్రి సేవలకు నెంబర్ వన్ అని మీరే అవార్డులు ఇచ్చారని తెలిపారు ఎర్రబెల్లి. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన వరద సహాయం వరంగల్ కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు, హైదరాబాద్ ప్రజలను మోసం చేసినట్లు వరంగల్ ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించబోమన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తే నిరూపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు ఏం చేశామో నయా పైసాతో సహా లెక్కలు చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించారు ఎర్రబెల్లి. నల్లధనం మొత్తం తీసిస్తే ఒక్కో పౌరుడికి 15లక్షలు బ్యాంకులో వేస్తానని ప్రధాని మోడీ ప్రకటన చేశారు.. అది ఎంత వరకు అమలు అయ్యిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Updates