కొండా సురేఖపై టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్లు ఫైర్

వరంగల్: త‌మ‌పార్టీ నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేసే నైతిక‌హ‌క్కు మాజీ మంత్రి కొండా సురేఖ‌కు లేద‌ని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్లు  ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. తాము సీఎం కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాల‌తోనే గెలిచామ‌ని, ఎవ‌రి ద‌యా, దాక్షిణ్యాల‌తో తాము విజ‌యం సాధించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌పై మాజీ మంత్రి కొండా సురేఖ త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో గొడవలు జరిగే విధంగా రెచ్చగొడితే సహించేది లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

Latest Updates