సంజయ్ నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే ఉరేసుకొని చచ్చేలా చేస్తాం..

వరంగల్ అర్బన్: ‘కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం. నోరు అదుపులో పెట్టుకో లేకపోతే వరంగల్‌లోనే ఉరేసుకొని చనిపోయే పరిస్థితి తీసుకువస్తాం’ అని జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్‌ను హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఆ పర్యటనకు ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీ దయాకర్‌లు కౌంటర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘బండి సంజయ్.. నోరు అదుపులో పెట్టుకో.. లేకపోతే వరంగల్‌లోనే ఉరి వేసుకునే పరిస్థితి తీసుకువస్తాం జాగ్రత్త. మీ నీచ రాజకీయాల కోసం భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేయవద్దు. నీకు దమ్ముంటే నిన్ను కన్న నీ తల్లిపై ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలి. మా సవాల్‌ను స్వీకరించు. నీ దగుల్బాజీ వేషాలు నిన్ను కన్న నీ అమ్మకైనా అర్థం అవుతాయి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తొండి సంజయ్ నువ్వు ఎక్కడున్నావ్. ఉద్యమనేత కేసీఆర్‌ను విమర్శించే అర్హత నీకు లేదు. కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పేలితే నాలుక చీరేస్తాం. బీజేపీ నేతలు ఖబడ్దార్. పునర్విభజన చట్టంలో హామీలు ఏమయ్యాయ్. బ్రోకర్ బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తే.. నిన్ను ప్రజలు బట్టలిప్పి కొడతరు. వారణాసిలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నువ్వు బండి సంజయ్ కాదు…. అబద్దాల సంజయ్. సంజయ్ ముచ్చట్లు చెబితే వరంగల్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీకి నువ్వు అధ్యక్షుడివని గుర్తుపెట్టుకో’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు.

For More News..

నాపై విషప్రయోగం జరిగింది.. ఇస్రో సీనియర్ సైంటిస్ట్

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌కు రివార్డును ప్రకటించిన కేంద్రం

Latest Updates