గన్ లైసెన్స్ ఇప్పించండి

‘ఊరు కాని ఊరు వెళ్లి డ్యూటీలు చేస్తున్నాం.. పొద్దున వెళితే మళ్లీ ఇంటికి వచ్చేసరికి ఏ రాత్రో అవుతోంది. బయట పరిస్థితులు బాగాలేవు. ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇప్పించండి సార్’ అంటూ ఓ మహిళా లెక్చరర్ వరంగల్ పోలీస్ కమిషనర్ కు
దరఖాస్తు చేసుకుంది. వరంగల్​అర్బన్ జిల్లా న్యూ శాయంపేటకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిని ఫాతిమా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా చేస్తోంది. జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి గన్ ఉంటే ఆత్మరక్షణ ఉంటుందని భావించింది. హన్మకొండలోని పోలీస్ ఉన్నతాధికారుల కార్యాలయానికి వెళ్లి తనకు గన్ లైసెన్స్ కావాలని లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంది. ఒక మహిళా ఉద్యోగి నుంచి ఇలాంటి రిక్వెస్ట్ రావడంతో అటు పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Latest Updates