ప్రైవేటు జూనియర్ కాలేజీలకు ఊరట..

ఫైర్ ఎన్ఓసీ నిబంధనల సడలింపు

హైదరాబాద్: ఫైర్ ఎన్ ఓసీ విషయంలో ఇరకాటంలో పడి.. ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. నిబంధనలను సడలిస్తూ.. నిర్ణయం తీసుకుంది సర్కార్. 15 మీటర్ల ఎత్తు తక్కువ ఉన్న అన్ని  జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని ఇంటర్ బోర్డు కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చుకున్న  కాలేజీలకు వెంటనే గుర్తింపు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 1406 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (ఆఫిలియేషన్) లభించే అవకాశం ఏర్పడింది.

 

 

Latest Updates